గత ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సీఆర్డీయే కార్యాలయ ప్రారంభోత్సవంతో సీఎం చంద్రబాబు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతికి మళ్లీ ప్రాణం పోసినట్లు చెప్పారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 2047 వరకు దిశానిర్ధేశం చేసే విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, “అమరావతిని నిర్మించడం లక్ష కోట్లు ఖర్చవుతుందని ఐదేళ్లపాటు దారి మళ్లించారని విమర్శించారు.
కానీ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. డబ్బుల్లేకుండా అభివృద్ధి సాధ్యమని హైదరాబాద్ ఉదాహరణగా ఉంది. గ్రిన్ఎనర్జీ, ఈవీ స్టేషన్లు, వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్ లతో సుందరమైన రాజధానిగా అభివృద్ధి చేస్తాం” అని అన్నారు.
రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం ద్వారా అమరావతిని కాపాడామని, పనులు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయని, 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తవుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు.