ఏపీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ. 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూతపడే స్థాయికి చేరుకున్న ప్లాంట్‌కి నూతన జీవం పోశారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు వ్యాఖ్యానించారు.
ఈ ప్యాకేజీ ద్వారా ప్లాంట్ పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, లక్షలాది మంది ఉద్యోగావకాశాలు సృష్టించనుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామి కీలకపాత్ర పోషించారని చంద్రబాబు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఈ ప్రణాళిక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రత్యేక హోదా లేని నేపథ్యంలో రాష్ట్రానికి ఇది గొప్ప ఉపశమనమని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.
స్టీల్ ప్లాంట్ తిరిగి సాధారణ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఈ పునరుద్ధరణతో ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేస్తుందని, యువతకు నిరుద్యోగం తగ్గుతుందని, ప్లాంట్ సక్సెస్ స్టోరిగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.