ఏపీ: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలనలో సలహాదారుల నియామకం విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయ పునరావాసంగా ఉన్న ఈ పదవులు, ఇప్పుడు ప్రభుత్వ పురోభివృద్ధికి ఉపయోగపడేలా మారాయి.
ఇందులో భాగంగా, వివిధ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు.
ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్‌ను స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారిగా నియమించారు. డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డికి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ బాధ్యతలు అప్పగించారు.
ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో కేపీసీ గాంధీ, హ్యాండ్‌లూమ్స్ హబ్‌కు భారత్ బయోటెక్ వైస్ చైర్మన్ సుచిత్రా ఎల్లా సలహాదారులుగా నియమితులయ్యారు.
ఈ నలుగురు కేబినెట్ హోదాతో రెండు సంవత్సరాల పాటు సేవలు అందించనున్నారు. టెక్నాలజీ, డిఫెన్స్, హ్యాండ్‌లూమ్స్, ఫోరెన్సిక్ రంగాల్లో వీరి అనుభవం రాష్ట్రాభివృద్ధికి దోహదపడనుంది.