అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటన చేసింది.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగవలసి ఉంది.
కాగా, పరీక్ష రాసే అభ్యర్ధుల నుండి వచ్చిన అధిక విజ్ఞప్తుల మేరకు మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కమీషన్ తెలిపింది.
అయితే, నూతన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఏపీలో మొత్తం 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి గానూ మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.
ఈ ప్రిలింస్ పరీక్షలకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తులు చేసుకోగా, అందులో కేవలం 4,496 మంది మాత్రమే మెయిన్స్ పరీక్షకు అర్హత పొందారు.