ముంబై: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేస్తున్న ఆశిష్ నెహ్రా మరియు డైరెక్టర్ విక్రమ్ సోలంకి జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఇద్దరూ గుజరాత్ జట్టుతో 2022 నుండి కొనసాగుతున్నారు. అయితే, వచ్చే సీజన్ కు మాత్రం కొనసాగే విషయంలో ఇద్దరూ సిద్ధంగా లేరని సమాచారం.
ఇదిలా ఉండగా, యువరాజ్ సింగ్ ను ఆశిష్ నెహ్రా స్థానంలో నిలిపేందుకు యాజమాన్యం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కానీ, ఆశిష్ నెహ్రా ఎందుకు జట్టును వీడాలనుకుంటున్నారో, అసంతృప్తికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చని క్రీడా విశ్లేషకులు ఆశిస్తున్నారు.