మూవీడెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇటీవల కంగువా రిలీజ్‌ను అడ్డుకునేందుకు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
నిర్మాత జ్ఞానవేల్ రాజా తమకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం కొంత మాత్రమే చెల్లించారనే ఆరోపణలతో కోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 7న విచారణ జరగాల్సి ఉండగా, శుక్రవారం హైకోర్టులో మళ్లీ ఈ కేసు తుది విచారణ జరిగింది.
స్టూడియో గ్రీన్ తరఫున న్యాయవాది కేసు వివరాలను కోర్టుకు వివరించి, మొత్తం బాకీని చెల్లించినట్లు వెల్లడించారు.
దీంతో జస్టిస్ అబ్దుల్ ఖుద్దూస్, కంగువా విడుదలకు అనుమతి ఇచ్చారు.
ఈ తీర్పుతో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో సినిమా విడుదలకు ఎటువంటి అడ్డంకుల్లేకుండా మార్గం సుగమమైంది.