fbpx
Wednesday, November 20, 2024
HomeMovie Newsకీర్తి సురేష్.. అతనితో ప్రేమ ఎప్పటి నుంచి?

కీర్తి సురేష్.. అతనితో ప్రేమ ఎప్పటి నుంచి?

KEERTHY-SURESH-LOVE-MARRIAGE-SOON
KEERTHY-SURESH-LOVE-MARRIAGE-SOON

మూవీడెస్క్: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి వచ్చిన ప్రచారం మరోసారి చర్చనీయాంశమైంది.

గతంలో అనేకసార్లు ఆమె వివాహానికి సంబంధించిన గాసిప్స్ వినిపించాయి. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి.

తరువాత అనిరుద్ రవిచందర్‌తో రిలేషన్‌షిప్ ఉందని ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ ఆ గాసిప్స్‌ని కీర్తి తల్లిదండ్రులు ఖండించారు.

తాజాగా, కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇద్దరూ చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ అని, 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని సమాచారం. ఆంటోనీ కొచ్చిలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారట.

కొంతకాలం దుబాయ్‌లో ఇంజనీర్‌గా పని చేసిన ఆయన, తర్వాత స్వదేశానికి వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డారు.

వారి పెళ్లి డిసెంబర్ 11 లేదా 12న గోవాలో జరిగే అవకాశముందని టాక్. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యేలా ప్రైవేట్ వేడుకను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై కీర్తి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి ఈ ప్రచారం వాస్తవమే అనిపిస్తోందని ఇండస్ట్రీలో భావిస్తున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రివాల్వర్ రీటా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.

ఒకవేళ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తే, అభిమానులు నిరీక్షణకు తెరపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular