మూవీడెస్క్: శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమా అనేక అడ్డంకులతో ముందుకు సాగుతోంది.
మొదట తారాగణం ఎంపికలో కొన్ని సమస్యలు, ఆపై ఇతర కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
అయితే, ఈసారి ఆలస్యానికి కారణం హీరోయిన్ రష్మిక మందన్న గాయపడటం కావడం గమనార్హం.
సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు రష్మిక వర్కౌట్ చేస్తూ గాయపడటంతో ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
దీంతో ఆమె సీన్స్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. నిర్మాతలు సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించగా, తాజా పరిస్థితుల వల్ల ఈ ప్లాన్‌కు ఆటంకం ఏర్పడింది.
దీనివల్ల సినిమా మొత్తం మరింత ఆలస్యం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ధనుష్ ఈ వాయిదాల వల్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తన షెడ్యూల్‌కు ఎప్పుడూ కచ్చితంగా ఉండే ధనుష్, ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ లేటు వల్ల ఆయన తదుపరి ప్రాజెక్టులపైనా ప్రభావం పడే అవకాశముంది.
నిర్మాతలు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి, చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు.
కానీ, రష్మిక కోలుకోవడానికి కనీసం నెల రోజులు పడుతుందని వైద్యుల అంచనా.
దీంతో “కుబేర” రిలీజ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.