మూవీడెస్క్: కేరళలో పుష్ప 2 కలెక్షన్లు! తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కలిగివున్నాడు.
ఈ ప్రేమతోనే ఆయన తనను కేరళ దత్తపుత్రుడిగా అభివర్ణించుకున్నాడు. ఈ నేపథ్యంలో పుష్ప 2 కు అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేరళ రైట్స్‌ను ఏకంగా 20 కోట్లకు విక్రయించగా, చిత్రానికి అక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే, ‘పుష్ప 2’ కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేదని చెప్పాలి.
ఇప్పటివరకు ఈ చిత్రం 17.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరలేదు.
కాగా, మలయాళీ ఆడియన్స్ నుంచి కొంత ఆసక్తి తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
కేరళలో 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాలీవుడ్ చిత్రాలలో ‘కల్కి 2898AD’ మొదటి స్థానంలో ఉంది.
ఈ సినిమా 31 కోట్ల గ్రాస్ వసూళ్లతో నిలిచింది. రెండో స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ బాస్కర్’ 21.55 కోట్లు వసూలు చేసింది.
‘పుష్ప 2’ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
అలాగే, ఎన్టీఆర్ ‘దేవర’ కేవలం 2.15 కోట్ల గ్రాస్ సాధించగా, ఈ ఏడాది తెలుగు సినిమాలు కేరళ మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
అంచనాలను అందుకోవడంలో పుష్ప 2 విఫలమైనా, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న విజయప్రవాహం టాలీవుడ్ ప్రభావాన్ని కొనసాగిస్తోంది.