fbpx
Monday, May 5, 2025
HomeMovie News'గమనం' ఎమోషనల్ ట్రైలర్

‘గమనం’ ఎమోషనల్ ట్రైలర్

Gamanam Trailer Released

టాలీవుడ్: శ్రియ శరన్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం గమనం. ఇందులో నిత్య మీనన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం విడుదల అయింది. తెలుగు లో పవన్ కళ్యాణ్, తమిళ్ లో జయం రవి, కన్నడ లో శివరాజ్ కుమార్, మలయాళం లో ఫాహద్ ఫాజిల్, హిందీ లో సోనూ సూద్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.

సినిమా ట్రైలర్ చూస్తే ఒక మూడు కథల సమాహారంగా అనిపించింది. ఈ సినిమాలో ఒక దుబాయ్ వెళ్లిన భర్త కోసం ఎదురు చూస్తూ సొంతంగా బ్రతికే అమ్మాయి పాత్రలో శ్రియ నటించింది. గొప్ప క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అనుకుని కష్టపడే పాత్రలో శివ కందుకూరి నటించాడు. అలాగే మరొక కథలో ఒక అనాథ పిల్లల కథని ఎంచుకున్నారు. వీళ్లందరి కథలో హైదరాబాద్ వరదలని ఇది వృత్తం గా చేసుకుని కథని నడిపించినట్టు అర్ధం అవుతుంది. ఇలాంటి జానర్ లో ఇదివరకు క్రిష్ రూపొందించిన వేదం లాంటి సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తం ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది.

ఈ సినిమాకి సుజనా రావు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారి రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇళయరాజా సంగీతం ఈ సినిమాని మరొక ప్లస్ గా చెప్పచ్చు. వీరితో పాటు టాక్సీవాలా ఫేమ్ ‘ప్రియాంక జవల్కర్’, సుహాస్, చారు హాసన్ కొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించారు

GAMANAM | Gamanam Latest Telugu Movie Trailer Launch By Pawan Kalyan | Sujana Rao | Kria Film Corp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular