మూవీడెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలుస్తోంది.
జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తూ మేకర్స్ మూవీపై హైప్ పెంచుతున్నారు.
ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం.
డిసెంబర్ 21న అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. మూడేళ్లకు పైగా మేకింగ్‌తో గేమ్ ఛేంజర్కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా, ఈ సినిమాకు తమిళనాడు రాజకీయ నాయకుడు, రచయిత ఎస్ వెంకటేషన్ కథ రచయితగా పనిచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మధురై ఎంపీగా ఉన్న వెంకటేషన్ రాజకీయ నేపథ్యంతోపాటు పాఠకులను ఆకట్టుకునే నవలలు కూడా రాశారు.
ఆయన రచనలలోని లోతైన అంశాలను శంకర్ ఉపయోగించుకుని, రామ్ చరణ్ పోషించిన ఐఏఎస్ పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
సెట్స్‌పై కూడా వెంకటేషన్ పాల్గొని, చరణ్ పాత్రకు విలువైన సూచనలు ఇచ్చారని టాక్.