యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. టిల్లు సిరీస్ హిట్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నా, రిలీజ్ తర్వాత మాత్రం మినిమమ్ రెస్పాన్స్ కూడా రాలేదు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది.
నైజాం ఏరియాలో ఈ సినిమాకు రూ. కోటి కూడా వసూలు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధు తన రెమ్యునరేషన్ భాగంగా నైజాం హక్కులు తీసుకోవడంతో, ఇప్పుడు నష్ట భారం అతనిపై పడినట్లైంది.
పంపిణీదారులు చెల్లించిన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రొడ్యూసర్ బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కు తలనొప్పి పెరిగింది.
ఆంధ్రా, సీడెడ్‌లో కూడా పరిస్థితి ఇలానే ఉందని సమాచారం. ఫస్ట్ డే నుంచే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పడిపోయాయి. ఈ తరహా థియేట్రికల్ డీల్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు.
గతంలో బీవీఎస్‌ఎన్ రూపొందించిన గాంఢీవదారి అర్జున కూడా డిజాస్టర్ అవ్వడంతో పంపిణీదారుల్లో అసంతృప్తి ఎక్కువైంది. ఇప్పుడు జాక్ కూడా అదే బాటలో వెళ్లడంతో, నిర్మాతలపై ఒత్తిడి పెరిగింది.