మూవీడెస్క్: తేజ సజ్జ ఇటీవల ఐఫా అవార్డుల వేడుకలో రానా దగ్గుబాటితో కలిసి యాంకర్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా కొన్ని ఫ్లాప్ సినిమాలపై వేసిన సెటైర్లు వివాదానికి దారితీశాయి. మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రానా మాత్రం హాస్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని వ్యంగ్యంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో తేజ సజ్జ మాత్రం మెచ్యూర్‌గా స్పందించారు.
ఒక ఈవెంట్లో ఈ విషయమై ప్రశ్న ఎదురైనప్పుడు తేజ, “నా చిన్నతనంలో కలిసి పనిచేసిన వారిపై నేను ఎలా కామెడీ చేస్తాను? ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లో స్క్రిప్ట్ అనేక దశలను దాటి అనుమతి పొందాకనే ప్రదర్శనకి వస్తుంది.
దాన్నే స్టేజి మీద చేస్తాం తప్పించి ఎలాంటి దురుద్దేశం లేదు,” అని వివరణ ఇచ్చారు. ఇది అభిమానులకు హాస్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునే సూచనగా నిలిచింది.
ఇదిలా ఉంటే తేజ తన సినిమాల ఎంపికలోనూ సంయమనం పాటిస్తున్నాడు.
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ తొందరగా సినిమాలు చేయకుండా, క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో కనిపించబోతుండగా, ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. తేజ తన పనితీరుతో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.