ఇప్పట్లో సినిమాలకు ప్రమోషన్లు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కోసం నిర్మాతలు, హీరోలు ఎవరి స్టేట్‌మెంట్స్ వారివే. “సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం” అనే మాటలు ఇప్పుడు “సినిమా బోరింగ్ అయితే నన్ను కొట్టండి” అనే స్థాయికి చేరుకున్నాయి.
తాజాగా ‘దిల్ రుబా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణ. “మా సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్‌గా ఉండను”, సినిమాలో ఫైట్స్ కూడా బాలేకపోతే నన్ను చితకొట్టండి.. అని ఆయన ప్రకటించడం, సినిమాపై నమ్మకమా లేక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే హైప్ టెక్నీకా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో కూడా హీరోలు, దర్శకులు ఇలాంటివే చెప్పారు కానీ, సినిమా ఫలితంతో ఆ మాటల్ని మర్చిపోయారు. కంటెంట్ కచ్చితంగా ఉన్నప్పుడు, సినిమా సహజంగానే హిట్ అవుతుంది. హైప్ క్రియేట్ చేయడం వల్ల తొలి రోజు కలెక్షన్లకు ప్రయోజనం ఉండొచ్చు కానీ, కంటెంట్ బలంగా లేకపోతే నెగటివ్ టాక్ వచ్చేస్తుంది.
ఇటీవల హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రమోషన్ కోసం కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే హైప్ కాకుండా కంటెంట్ మీదే దృష్టి పెట్టాలి. ‘దిల్ రుబా’ వాస్తవంగా హిట్ అవుతుందా, లేక ఇది కూడా ఓ గిమ్మిక్ ప్రమోషన్‌గానే మిగిలిపోతుందా అనేది త్వరలోనే తేలనుంది.