మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
సినిమా రిలీజ్ ముందు నుండి భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం, సోలోగా ఎన్టీఆర్ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాస్ అందుకుంది.
ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రంతో తన సక్సెస్ ట్రాక్‌ను తిరిగి సాధించడమే కాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ అందించారు.
దేవరలో ప్రధానమైన దేవర పాత్ర చనిపోతుంది అని చూపించినప్పటికీ, క్లైమాక్స్‌లో ఇది నిజంగా జరిగిందా లేదా అన్న సందేహాన్ని సస్పెన్స్‌గా వదిలేశారు.
ముఖ్యంగా, సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందని సూచనలిచ్చారు.
ఇక, వర క్యారెక్టర్ కథ నడవబోతుందని భావిస్తున్న ప్రేక్షకులకు, సినిమాకు చెందిన మరో కీలక విషయం తాజాగా వెల్లడైంది.
ఈ సినిమాలో భైరా కొడుకుగా నటించిన తారక్ పొన్నప్ప ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశారు. “దేవర క్యారెక్టర్ చనిపోదు.
మొదటి పార్ట్‌లో సస్పెన్స్‌గా వదిలిన కథను సెకండ్ పార్ట్‌లో పూర్తిగా రివీల్ చేస్తారు.
దేవర పాత్రకు సంబంధించి పార్ట్ 2లో కొన్ని షాకింగ్ ట్విస్టులు ఉంటాయి,” అని చెప్పారు.
ఇక యతి పాత్రను కూడా మొదటి పార్ట్‌లో క్లియర్ చేయలేదు. ఆ పాత్ర సెకండ్ పార్ట్‌లోనే పూర్తి స్థాయిలో రివీల్ చేయబోతున్నారు.
“యతి పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది, కానీ అది ఎవరు అనేది ఇప్పుడు చెప్పడం సరికాదు,” అని తారక్ పొన్నప్ప వెల్లడించారు.
ప్రస్తుతం దేవర 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ ఈ పార్ట్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.