ఏపీ: మంత్రి నారా లోకేష్ నర్సింగ్ విద్యార్థులకు, నర్సులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు వినూత్న ప్రణాళికను అమలు చేయనున్నారు. రాష్ట్రంలో నర్సింగ్ చదివే విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వారు ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం పెరుగుతుందని మంత్రి తెలిపారు.
తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్-బీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నారా లోకేష్ సమక్షంలో జర్మన్ భాషా శిక్షణకై ఎంవోయూపై సంతకాలు చేశారు. జర్మనీలో నర్సుల కొరత ఉండటంతో, ఏపీ నుంచి నర్సులను అక్కడికి పంపించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
కేవలం జర్మనీ మాత్రమే కాకుండా, ఇంగ్లాండ్, జపాన్, చైనా, దుబాయ్ దేశాలకు అవసరమైన భాషలను కూడా నర్సులకు నేర్పించనున్నారు. తద్వారా, వారికీ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పెరుగుతాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని నర్సులకు భాషా సమస్యలు ఎదురవుతున్నాయి. కేవలం 40% మందికి మాత్రమే ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉంది. ఈ కారణంగా వారికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
ఈ ప్రణాళికతో నర్సింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.