మూవీడెస్క్: యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, నితిన్ వెంకీ కాంబోలో భీష్మ తర్వాత వస్తున్న మరో భారీ ఎంటర్టైనర్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. “వన్ మోర్ టైమ్” పాటకు వచ్చిన క్రేజ్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
అయితే రెండో పాట విడుదలలో జాప్యం కావడం, సినిమా విడుదల తేదీపై అస్పష్టత నెలకొనడం చర్చనీయాంశంగా మారాయి.
జనవరి 25న విడుదల చేసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, నితిన్ మాత్రం సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారు.
అవసరమైతే నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు స్వయంగా తీసుకోవాలని సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి ప్రతిభావంతుల నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ త్వరలో రావచ్చు.
నితిన్ అభిమానులు మాత్రం అనుకున్న తేదీకే సినిమా విడుదలవ్వాలని ఆశిస్తున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి.