ఆస్ట్రేలియా: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
భారత జట్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన నితీశ్ 105 పరుగులు చేసి, భారత్‌ను కీలకమైన ఫాలో-ఆన్ ముప్పు నుంచి రక్షించాడు. 171 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్ నితీశ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
సెంచరీ అనంతరం నితీశ్ చేసిన సెలబ్రేషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. హెల్మెట్ మీద జాతీయ జెండా గుర్తు ఉంది కాబట్టి అలా బ్యాట్ పైన ఉంచి వందనం చేశానని, దేశం పట్ల నాకు ఉన్న గౌరవాన్ని తెలియజేషనని తెలిపారు.
ఈ అద్భుత ప్రదర్శన తర్వాత నితీశ్ మాట్లాడుతూ, దేశం తరఫున ఆడటం తనకు గర్వకారణమని, ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో చిరస్మరణీయమని తెలిపారు.
తన తండ్రి ముత్యాలరెడ్డి స్టేడియంలో ప్రత్యక్షంగా తన ఆటను వీక్షించడం ప్రత్యేకమైన అనుభూతి అని నితీశ్ చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌తో నితీశ్ భారత క్రికెట్‌లో తేలికపాటి ఆటగాడి నుండి కీలక ఆటగాడిగా ఎదిగే మార్గాన్ని అందుకున్నాడు. అభిమానుల నుండి, క్రికెట్ నిపుణుల నుండి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.