ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై నార్త్ అమెరికాలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్‌లో కొత్త రికార్డులు సెట్ అవుతాయనే టాక్ ఉంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం యూఎస్ఏలో 15 మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదల కానుంది.
ఈ సారి పుష్ప 2 చిత్రానికి రిఫండబుల్ బేసిస్‌లో డీల్స్ కుదిరినట్లు సమాచారం. అంటే.. యూఎస్ఏలో టార్గెట్‌గా నిర్ధేశించిన మొత్తాన్ని అందుకోకపోతే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో డీల్స్ జరుగుతున్నప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా విజయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇక పుష్ప 2 హిందీ వెర్షన్‌కి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశమున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 600 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగొచ్చని అంచనాలు ఉన్నాయి.