‘ఉప్పెన’తో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బుచ్చిబాబు సానా, తన రెండో సినిమా ‘పెద్ది’తో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ కథ ఎన్టీఆర్ కోసం రెడీ చేశారా? రామ్‌చరణ్‌కే స్పెషల్‌గా తయారు చేశారా? అనే చర్చలకు తాజాగా బుచ్చిబాబు ముగింపు పలికారు.
ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తెలిపిన ప్రకారం, ఈ కథను మొదట తన గురువు సుకుమార్‌కు వినిపించాడట. అప్పుడే సుక్కు ‘ఇది చరణ్‌కు చాలా బాగా వర్కౌట్ అవుతుంది’ అని సూచించాడని వెల్లడించారు. దీంతో కథను ఎన్‌టీఆర్‌కు చెప్పలేదన్న క్లారిటీ వచ్చేసింది.
ఇక ఇటీవల విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’ టీజర్‌కి స్పెషల్ రెస్పాన్స్ వచ్చింది. గ్రామీణ మాస్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ పాత్ర స్టైల్, పవర్‌ఫుల్ ఫైట్స్‌కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆయన మరొకసారి ‘RRR’ తరహా మాస్ మూడ్‌లో కనిపించబోతున్నారు.
టీజర్ రిలీజ్ సమయానికి చరణ్ ఇంట్లోనే ఉన్న బుచ్చిబాబు, మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంసల్ని జీవితాంతం మర్చిపోలేనని భావోద్వేగంగా తెలిపారు. ఈ సంఘటన తనకు ప్రేరణనిచ్చిందని చెప్పారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం, మోస్ట్ వేటెడ్ మూవీగా నిలిచింది.