మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజా సాబ్ త్వరలో విడుదల కానుండగా, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకమైన మలుపుగా నిలవనుందని టాక్.
ఫౌజీలో ప్రభాస్ ఓ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
దేశభక్తి, యాక్షన్, ఎమోషన్ మేళవించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
సీతారామం లాంటి క్లాసిక్ ఇచ్చిన హను రాఘవపూడి, ఇప్పుడు మాస్ యాక్షన్ డ్రామా తీసేందుకు సిద్దమవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 2025 చివరికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌ను 2026 వేసవిలో ఉంచాలని మేకర్స్ నిర్ణయించారు.
ప్రభాస్ మార్కెట్ భారీగా ఉండటంతో, సమ్మర్ రిలీజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించవచ్చని అంచనా.
ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నాడు.
యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్నీ కలిపి ఈ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత చిత్రాలు మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ఫౌజీ మాత్రం కొత్త లుక్‌లో ప్రభాస్‌ను చూపించబోతోందని టాక్.
మరి ఈ సినిమా బాక్సాఫీస్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.