మూవీడెస్క్: ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్.. కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియని ఈ అమ్మాయి, ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా ఫౌజీ (వర్కింగ్ టైటిల్)లో ప్రభాస్ జోడిగా ఆమె నటిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రంతో ఆమెకు తొలి సినిమా నుంచే బిగ్ బ్రేక్ దక్కడం సినిమాపరిశ్రమలో చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ కూడా ఇమాన్విపై ఫోకస్ చేశారు.
టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందనున్న రొమాంటిక్ చిత్రానికి ఆమెను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికే ఫౌజీలో భాగస్వామిగా ఉన్న భూషణ్ కుమార్, తన సినిమాలో కూడా ఆమెను సెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ముంబై వర్గాలు చెబుతున్నాయి.
ఇమాన్వి గురించి పెద్దగా సమాచారం లేకపోయినా, సోషల్ మీడియాలో ఆమె రీల్స్, డాన్స్ చూసినవారు ఆమెపై మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఫౌజీలో ఆమె ఎలా కనిపిస్తుందో చూడాలనే ఆసక్తి పెరిగింది.
ఫౌజీ తర్వాత ఇమాన్వి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ప్రధాన ఛాయస్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.