మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ కు తప్పని భారీ ఓటమి. మెల్బోర్న్ లో జరిగిన 4వ టెస్టులో భారత్ 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవి చూసింది.
తొలి ఇన్నింగ్స్ నుండే ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి సెంచరీతో ఫాలోఆన్ తప్పించుకున్న భారత్ 2వ ఇన్నింగ్స్ లో పుంజుకోలేక పోయింది.
2వ ఇన్నింగ్స్ లో భారత్ టాప్ బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రమే 84 పరుగులతో పోరాడాడు. రిషబ్ పంత్ 30 పరుగులు చేశారు.
ఇక మిగతా ఏ బ్యాటర్లు కూడా రెండంకెల పరుగులు చేయలేకపోయారు. దీంతో భారత్ కు భారీ ఓటమి తప్పలేదు.
ఈ విజయంతో ఆసీస్ సిరీస్ లో 2-1 తో లీడింగ్ లోకి వచ్చింది. ఇక తదుపరి చివరి టెస్ట్ ఏమవుతుందో చూడాలి.
భారత్ ఈ ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దాదాపు అసంభవమనే చెప్పాలి. ఈ పాటీకే సౌతాఫ్రికా ఫైనల్ చేరుకుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా మాత్రమే తదుపరి వరుసలో ఉన్నాయి.
ఇక భారత్ ఫైనల్ చేరడం అనేది దాదాపు అసాధ్యం అనే క్రీడాభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేసున్నారు.