తెలంగాణ: రాష్ట్రంలో సంచలనం రేపిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.
ఈ సిట్‌కు ఐజీ రమేష్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను నియమించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయి.
ప్రత్యేకించి పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం గమనార్హం.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం… ఇప్పటికీ జరుగుతున్న దర్యాప్తును మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లేందుకు సిట్‌ను రంగంలోకి దింపింది. నెలన్నర రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని డీజీపీ జితేందర్ సిట్ అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారం ద్వారా మరోసారి సోషల్ మీడియాలో ప్రమోషన్లతో సెలబ్రిటీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.