న్యూఢిల్లీ: భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, కానీ తమ జోలికి వస్తే ధీటైన సమాధానం ఇవ్వడానికి సిద్ధం అన్నారు రాజ్ నాథ్ సింగ్. ఈరోజు ఆయన లద్దాఖ్ లోని లేహ్ లో పర్యటించారు.
భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులలో రాజ్ నాథ్ సింగ్ లద్దాఖ్ లో ఎలేసీ వద్ద పర్యటీంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ఉన్నారు.
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ప్రపంచానికి భారత దేశం ఎప్పుడు శాంతి సందేశాన్నే ఇచ్చిందని రాజ్‌నాథ్ ఈ సందర్బంగా తెలియజేశారు. అయితే, భారత్ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితి లో ఉపేక్షించమని చెప్పారు.
విషమ పరిస్థితులు వస్తే దీటుగా జవాబు చెప్పడానికి భారత్ ఎల్లంప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ తాకలేరని, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని చెప్పారు.
భారత దెశం లో అందరికి మొదట దేశ గౌరవమే అన్నింటి కన్నా చాలా ప్రాధాన్యమని, దాన్ని సగర్వంగా చెబుతన్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, అమరవీరులకు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తున్నానని ఆయన ఈ నేపథ్యంలో వ్యాఖ్యానించారు.