హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగి వినియోగదారులను షాక్‌కు గురి చేశాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹350 పెరిగి ₹89,100కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధర కూడా పెరిగి కిలో ₹1,08,000 పలుకుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ₹80,550కి చేరుకోగా, 24 క్యారెట్ల పసిడి ₹87,870కి పెరిగింది. కిలో వెండి ధర ₹1.08 లక్షలకు చేరుకోవడం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు $2,941.55 వద్ద ట్రేడవుతోంది. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి వైపుకు మళ్లడం, రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం బంగారం కొనుగోలు చేసే వారు కొంత నిరీక్షించడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగితే పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది.