మూవీడెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోయే పాన్-ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఎన్నో రకాల కథలు, లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ మూవీ కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే, కొత్తగా వినిపిస్తున్న లీక్ ప్రకారం, అసలు కథ వారణాసి బ్యాక్‌డ్రాప్‌తో ప్రారంభమవుతుంది.
మహేష్ బాబు ఇందులో గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా, ఒక వరల్డ్ ట్రావెలర్ పాత్రలో కనిపించబోతున్నారు.
రాజమౌళి స్వయంగా ఆఫ్రికా అడవులను చుట్టివచ్చిన కారణంగా, మరింత వైవిధ్యమైన లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుందట.
ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో కనిపించే ఒక స్పెషల్ సీన్ కూడా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
RRRలో రామ్ చరణ్ రాముడి లుక్ ఎంతగా ఆకట్టుకుందో, అదే రీతిలో ఈ సీన్ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది.
మహేష్ బాబు రాముడి అవతారంలో కనిపించడం ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇక మహేష్ హీరోగా, రాజమౌళి ఇండియానా జోన్స్ తరహాలో ఎన్నో రహస్యాలు, గుప్త నిధుల వేటతో కూడిన అద్భుత కథను చెప్పబోతున్నారు.
హిందూ దేవాలయాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో కీలకంగా ఉండనున్నట్లు సమాచారం.
అయితే సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధమయ్యాకే ప్రారంభమవుతుందని రాజమౌళి స్పష్టం చేశారని తెలుస్తోంది.