మూవీడెస్క్: గత డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ కోసం అన్నీ సిద్ధమై, పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమవుతుందనుకున్నారు.
కానీ అనూహ్యంగా ప్రాజెక్ట్ వాయిదా పడటం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ముహూర్తం కుదరకపోవడం, స్వల్ప ఆరోగ్య సమస్యలే కారణమని తెలిపారు.
అయితే, ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటనేది రకరకాల ప్రచారాలకు దారి తీసింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైందని చెప్పినా, చివరి నిమిషంలో ప్రాజెక్ట్ వాయిదా పడింది.
సంక్రాంతి పండుగ సమయంలో ఎటువంటి ప్రకటన వస్తుందేమోనని అభిమానులు ఆశించారు.
కానీ, ప్రస్తుతానికి బాలకృష్ణ, డాకు మహారాజ్ ప్రచారంలో బిజీగా ఉన్నారని, డెబ్యూ అప్డేట్ కొంచెం ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
మోక్షజ్ఞ కోసం మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావాలనేది అభిమానుల కోరిక.
అయితే, ఆదిత్య 369 సీక్వెల్‌లో మోక్షజ్ఞకి కీలక పాత్ర ఇవ్వాలనే బాలకృష్ణ ఆలోచన ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజిలో ఉందని, త్వరలోనే వివరాలు వెల్లడికావొచ్చని అంటున్నారు.
మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో స్పష్టత రాకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
అనవసరమైన ఆలస్యం కాకుండా, వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వడం బాలకృష్ణ టీమ్ నుంచి ఆశిస్తున్నారు.