fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమోహన్ లాల్ - మమ్ముట్టి భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్

మోహన్ లాల్ – మమ్ముట్టి భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్

MOHANLAL-MAMMOOTTY-MULTI-STARRER-COMBO-AFTER-LONG-GAP
MOHANLAL-MAMMOOTTY-MULTI-STARRER-COMBO-AFTER-LONG-GAP

మూవీడెస్క్: మలయాళ సినీ పరిశ్రమలో మరో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇరువై ఏళ్ల తరువాత మోహన్ లాల్ – మమ్ముట్టి కలిసి తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీలంకలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

మోహన్ లాల్ దీపారాధన చేయగా, సహ నిర్మాతలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ లాల్, మమ్ముట్టితో పాటు ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరోవైపు రంజి పణికర్, రాజీవ్ మీనన్, దర్శనా రాజేంద్రన్ వంటి నటులు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

జోసెఫ్ ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సహ నిర్మాతలుగా సిఆర్ సలీం, సుభాష్ జార్జ్ మాన్యువల్ పని చేస్తున్నారు.

శ్రీలంక, లండన్, అజర్ బైజాన్, అబు ధాబి వంటి ప్రదేశాల్లో 150 రోజుల పాటు షూటింగ్ జరగనుంది.

ఈ ప్రాజెక్ట్‌కు మణుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, రంజిత్ అంబాడి మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నారు.

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ ఇన్నాళ్లకు రీ యూనైట్ అవుతుండటంతో, ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మహేష్ నారాయణన్ దర్శకత్వం, బలమైన తారాగణం, విభిన్నమైన కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ మలయాళ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular