మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం, చరణ్ ఈ సినిమాలో ఓ వైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు.
కానీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు అంధుడిగా మాత్రం నటించడని తెలుస్తోంది.
ఈ పాత్ర కోసం దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయించాడని, అది చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం.
టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఊహించని మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా, చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే టాక్ ఉంది.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టింది. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
మొత్తంగా, చరణ్ అంధుడిగా నటిస్తున్నాడనే వార్తలకు తెరపడింది. కానీ, ఈ పాత్రలో అతడి నటన కొత్త కోణాన్ని చూపించేలా ఉండబోతుందని అంటున్నారు.