మూవీడెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌ను కొత్త దారిలో తీసుకెళ్లేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.
ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, ఆ తర్వాత సుకుమార్‌తో RC17 ప్లాన్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తికాగానే బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్.
ఇటీవల బాలీవుడ్‌లో కిల్ మూవీతో హిట్ కొట్టిన నిఖిల్ నగేష్ భట్, రామ్ చరణ్ కోసం ఓ పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని సమాచారం.
ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో హై ఓక్టేన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన కిల్ టేకింగ్ అందరినీ ఆకట్టుకుంది.
అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో చరణ్ పని చేస్తే, మరో పాన్ ఇండియా హిట్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేకపోయినా, చరణ్ – నిఖిల్ భట్ కాంబోపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ త్వరలో రానుందా? లేక ఇది కూడా రూమరేనా? అనేది చూడాలి.