లీగల్ ఫైట్ కు సిద్ధమైన టాలీవుడ్ నటి హేమ
తెలుగు సినీ నటి హేమ మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమెపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ, యూట్యూబ్ వ్లాగర్లు, సోషల్ మీడియా పేజీలపై లీగల్ నోటీసులు జారీ చేశారు. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి పేర్లు ఈ నోటీసుల్లో ఉండటం గమనార్హం.
అసత్య ప్రచారాలతో తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం సహించబోమని, చట్టపరంగా పోరాటానికి సిద్ధమయ్యామని హేమ లాయర్ స్పష్టం చేశారు. డ్రగ్ కేసులో నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ, మీడియాలో ఆమెను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
“నా విలువను కించపరచేలా మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను” అంటూ గతంలో హేమ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మాటను కార్యరూపంలోకి తీసుకురావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారం న్యాయపరంగా ఎటు వెళుతుందో చూడాలి. నోటీసులు అందుకున్న వారు క్షమాపణలు చెబుతారా? లేక కేసును ఎదుర్కొంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.