మూవీడెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా జన నాయకన్.
ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేశాయి.
విజయ్ రాజకీయ ప్రస్థానం మొదలుకానుండటంతో, ఈ సినిమాకు మరింత ప్రత్యేకత ఏర్పడింది.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
తమిళ సినిమా చరిత్రలో ఏ సినిమాకు జరగని విధంగా, జన నాయకన్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 75 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్.
కోలీవుడ్‌లో ఇదే అత్యంత పెద్ద మొత్తం కావడంతో, ఇండస్ట్రీలో ఈ డీల్ పై భారీ చర్చ జరుగుతోంది.
ఇప్పటికే విజయ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
గతంలో వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మంచి కలెక్షన్లు సాధించింది.
ఇప్పుడు జన నాయకన్ విజయ్ చివరి సినిమా కావడంతో, ప్రేక్షకుల్లో, డిస్ట్రిబ్యూటర్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా విజయ్ రాజకీయ ప్రయాణానికి మరింత బలమైన బూస్ట్ ఇచ్చేలా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
థియేట్రికల్ బిజినెస్‌తోనే ఈ స్థాయి హైప్ రావడం, విజయ్ స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేస్తోంది.