మూవీడెస్క్: వంద కోట్ల నంబర్ల వసూళ్ల గురించి మాత్రమే మాట్లాడుకునే రోజులు పోయాయి. ఇప్పటి ట్రెండ్ వెయ్యి కోట్ల క్లబ్.
ఈ క్లబ్లో చేరడం ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు పెద్ద టార్గెట్ గా మారింది.
తాజా గా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఆ క్లబ్ లో చోటు సంపాదించి టాలీవుడ్ పరాక్రమాన్ని మరోసారి చాటిచెప్పింది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకుంది.
ఇప్పటి వరకు ఈ క్లబ్ లో ఎనిమిది ఇండియన్ సినిమాలు మాత్రమే ఉండగా, అందులో నాలుగు టాలీవుడ్ సినిమాలే కావడం గర్వకారణం.
బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో రాజమౌళి ఈ ఫీట్‌ను మొదలుపెట్టాడు. ఆ తరువాత ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ ఈ క్లబ్ లో చేరింది.
తాజాగా పుష్ప-2 కూడా జాయిన్ కావడం విశేషం. బాలీవుడ్లో కూడా ఈ సినిమా దూకుడు తగ్గడం లేదు.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను తీసుకువచ్చాయి.
బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాను బాలీవుడ్ నటులు చేయలేరని, చేస్తే కథలో మార్పులు చేయాల్సి వచ్చేదని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యలు చేయడం విశేషం.