టాలీవుడ్‌లో ఎంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల, ఇప్పుడు తన కెరీర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె, ఇప్పుడు ఇతర భాషల్లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోంది.
2025లో ఆమె మరింత బిజీగా మారబోతోందని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న SK25 సినిమాతో తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వనుంది.
అదేవిధంగా, బాలీవుడ్ లో కూడా శ్రీలీల క్రేజ్ పెరుగుతోంది. కార్తిక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు సమాచారం. ఇంకా మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఇబ్రహీం అలీఖాన్‌తోనూ ఓ సినిమా చేసే అవకాశముంది.
టాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ స్టేటస్ ఉన్న శ్రీలీల, ఇతర ఇండస్ట్రీల్లోనూ అదే స్థాయిని అందుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ విజయవంతమైతే ఆమె పాన్ ఇండియా స్టార్‌గా మారడం ఖాయం. మరి శ్రీలీల హవా ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి!