మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్‌లో బిజీగా ఉండగా, సుకుమార్ తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను RC17గా 2026లో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న చర్చ మొదలైంది. సమంత పేరు బలంగా వినిపిస్తుండగా, మరోవైపు రష్మిక మందన్నా కూడా ఈ రేసులో ఉందని టాక్. రంగస్థలంలో సమంత, చరణ్ కాంబో అద్భుతంగా పనిచేసిన నేపథ్యంలో మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సమంత ఆరోగ్య పరిస్థితులు, కెరీర్ ప్రాధాన్యతలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారట.
ఇక రష్మిక, పాన్ ఇండియా రేంజ్‌లో మంచి క్రేజ్ సంపాదించడంతో ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే, సుకుమార్ స్టార్ ఫాక్టర్‌కు కాకుండా కథకు న్యాయం చేసేలా క్యాస్టింగ్ చేస్తారని భావిస్తున్నారు. మరోవైపు కొత్త హీరోయిన్‌కు కూడా అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారని సమాచారం.
ఈ భారీ ప్రాజెక్ట్ 2027లో విడుదల కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుకుమార్ తన క్యాస్టింగ్ ఎంపికతో ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడో చూడాలి.