నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 పై భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా, హిట్ సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో భాగంగా వస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి.
నాని సినిమాలు యూఎస్ మార్కెట్‌లో ఎప్పుడూ బలమైన వసూళ్లు సాధించడమే ప్రత్యేకత. అదే సెంటిమెంట్ ఇప్పుడు హిట్ 3కి కూడా వర్తించింది. తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా 3 లక్షల డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేసింది.
ఈ గణాంకాలు చూస్తుంటే, ప్రీమియర్ షోస్‌తో పాటు డే 1 కలెక్షన్లపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మే 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, మొదటి రోజు మంచి గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, నాని తన Wall Poster Cinema బ్యానర్‌లో నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు. ట్రైలర్ చూసినవారంతా నాని పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. మొత్తానికి హిట్ 3 యూఎస్ మార్కెట్‌లో మంచి ఓపెనింగ్స్‌తో నాని మరో సూపర్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.