మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మించనుండగా, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను 10 నెలల్లో పూర్తి చేసి, 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు.
పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ఎక్కువ సమయం అవసరమవుతుందని తెలిసిందే.
కానీ ప్రశాంత్ నీల్ తన గత సినిమాలను షెడ్యూల్ ప్రకారమే పూర్తిచేయడం అందరికీ తెలుసు.
ఈ సినిమాను కూడా అనుకున్న టైంలో పూర్తి చేయగలరా? అనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది.
మరోవైపు, ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాడు. వెంటనే ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆమె పాత్ర సలార్‌లో శృతి హాసన్ పాత్రలానే పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది.
భారీ యాక్షన్ ఎలిమెంట్లు, ఎన్టీఆర్ మాస్ అప్పీల్ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లబోతున్నాయి.
ఎలాంటి జాప్యం లేకుండా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలరా? 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలరా? అనే ప్రశ్నకు సమాధానం త్వరలో తెలుస్తుంది.