న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జవాన్లకు శుభవార్త అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పై దేశంలో ఉన్న జవాన్లకు ప్రతి ఏటా 100 రోజుల సెలవులను ఇచ్చే నిర్ణయాన్ని త్వరలోనె ప్రకటించనున్నట్లు సమాచారం.
సీఆర్పీఎఫ్, బీఎసెఫ్, ఐటీబీపీ సీఐఎసెఫ్, ఎసెస్బీ తదితర కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు సెలవిచ్చి వారి కుటుంబం తో గడిపే అవకాశం కల్పించాలన్న అమిత్ షా నిర్ణయం త్వరలోనే సాకారం కనుంది.
జవాన్లు సెలవులు తక్కువ ఉండి ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలు, తోటి జవాన్లను కాల్చడం, వారిలో ఆనందాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.