fbpx
Friday, January 31, 2025
HomeNationalవెయ్యి కిలోల బంగారంతో బోర్డు తిప్పేసిన సంస్థ

వెయ్యి కిలోల బంగారంతో బోర్డు తిప్పేసిన సంస్థ

1000KG-GOLD-SCAM-IN-CHENNAI

చెన్నై: చెన్నై రూబీ జువెల్లరీ యాజమాన్యం వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన కుంభకోణం కేసులో కీలక పెద్ద పరిణామం ఇవాళ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే చెన్నై పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మరోసారి భారీఎత్తున తనిఖీలు చేపట్టారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం మరోసారి అమీన్ పూర్‌లో షెల్టర్ తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించింది.

2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యల్లో హైదరాబాద్‌ అమీన్ పూర్ పోలీస్టేషన్ పరిధి భెల్‌ మెట్రో కాలనీలో ఇంట్లో నిందితుడు, పరారీలో ఉన్న జ్యువెలర్స్‌ యజమాని సయ్యద్ ఇబ్రహీంకు పోలీసులు చెక్‌ పెట్టారు. ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే వెయ్యి కిలోలకు పైగా ఖాతాదారుల యొక్క బంగారాన్ని మింగేసిన చెన్నైలో రూబీ గోల్డ్ జ్యువెలర్స్‌ యజమాని సయ్యద్ ఇబ్రహీం మోసం 2019, మేలో వెలుగులోకి వచ్చింది. వడ్డీ లేని రుణాలకు బదులుగా తాకట్టు పెట్టిన బంగారంపై వడ్డీ లేని రుణాలిస్తానంటూ ఇబ్రహీం ప్రజలను నమ‍్మబలికాడు.

ఖాతాదారుల బంగారం విలువలో మూడింట ఒక వంతు వరకు రుణాలు ఇస్తానని తెలిపాడు. అయితే డబ్బును తిరిగి ఇచ్చిన తర్వాత కూడా ఇబ్రహీం ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో 1500 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇలా గత మూడేళ్లలో 3 వేల మందికి పైగా రూ. 300 కోట్ల వరకు విలువైన 1,000 కిలోల బంగారాన్ని నిందితులు సేకరించినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular