టాలీవుడ్: సంగీత దర్శకుడిగా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలకి బాగానే పనిచేసిన సాయి కార్తీక్ నిర్మాతగా ‘100 క్రోర్స్’ అనే సినిమా రూపొందుతుంది. హ్యాపీ డేస్ సినిమా ఫేమ్ ‘రాహుల్’ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసారు.
నవంబర్ 2016 లో నరేంద్ర మోడీ 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు ప్రకటనతో టీజర్ ప్రారంభం అయింది. సిటీ అవుట్ స్కర్ట్స్ లో చాలా బ్లాక్ మనీ తగలబెట్టినట్టు చూపిస్తారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నుండి బయలుదేరిన ఒక పెద్ద ట్రక్ చూపించారు. ఆ ట్రక్ ని చోరీ చేసే థీమ్ తో ఈ సినిమా రూపొందినట్టు అర్ధం అవుతుంది. ఆ ట్రక్ లో ఉన్న 100 కోట్లని చోరీ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసారు , చోరీ చేయడం లో సక్సెస్ అయ్యారా లేదా అనేది మిగతా సినిమా అని తెలుస్తుంది.
మొదటి సారి నిర్మాణం చేపట్టిన సాయి కార్తీక్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఎస్.ఎస్.స్టూడియోస్ , విజన్ సినిమాస్ బ్యానర్ పై దివిజ సమర్పణలో నాగం తిరుపతి రెడ్డి మరియు సాయి కార్తీక్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా సాయి కార్తీక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో చేతన్, సాక్షి చౌదరి, ఏమి, ఐశ్వర్య నటిస్తున్నారు. విరాట్ చక్రవర్తి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.