టాలీవుడ్: సెకండ్ వేవ్ తర్వాత వరుసగా విడుదలవుతున్న చిన్నసినిమాల్లో శ్రీనివాస్ అవసరాల నటించిన ‘101 జిల్లాల అందగాడు’ సినిమా వచ్చే వారంలో విడుదల అవనుంది. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాలా’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
హెరిడీటీ కారణంగా చిన్న వయసులోనే బట్ట తల వచ్చి ప్రేమ, పెళ్లి కోసం ప్రతి స్టేజ్ లో ఇబ్బంది పడే పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. తన ప్రాబ్లం నుండి బయటపడడానికి హెయిర్ విగ్ ధరించి దానివల్ల వచ్చే కస్టాలు, కామెడీ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేయనున్నాడు. ఈ క్రమం లో రుహాణి శర్మ రూపం లో తన లైఫ్ లోకి రాబోయే అమ్మాయికి తనకి ఇలాంటి ఒక ప్రాబ్లెమ్ ఉందని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రాసెస్ లో ఎమోషనల్ గా ఎంత సఫర్ అవుతున్నాడు అనేది ట్రైలర్ లో చూపించారు. వినోదం తో పాటు ఒక ఎమోషనల్ జర్నీ చూపించబోతున్నట్టు ట్రైలర్ లో తెలుస్తుంది.
చి.ల.సౌ సినిమాలో నటించిన రుహాణి శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తల్లి పాత్రలో సీనియర్ నటి రోహిణి నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సెప్టెంబర్ 3 న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.