జాతీయం: భారత్‌లో సెకనుకు 11 సైబర్ దాడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మాల్‌వేర్‌లు భారత్‌లో సైబర్ దాడులను పెంచే అవకాశం ఉందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్-2025 వెల్లడించింది. గత ఏడాది కాలంలో సగటున ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్లు నివేదిక తెలిపింది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఐటీ రంగాలు ప్రధానంగా ఈ దాడుల ప్రభావానికి గురయ్యాయి.
సైబర్ దాడుల ప్రభావం:
- గత ఏడాది కాలం: దేశవ్యాప్తంగా 36.9 కోట్ల మాల్‌వేర్ దాడులు జరిగాయి.
- ప్రభావిత రంగాలు: హెల్త్‌కేర్ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (17.38%).
- సగటు లెక్కలు: నిమిషానికి 702 దాడులు, సెకనుకు 11 దాడులు.
- అత్యధిక మాల్‌వేర్ గుర్తింపు: తెలంగాణ రాష్ట్రం (15.03%).
రాబోయే ప్రమాదాలు
2025 నాటికి ఏఐ ఆధారిత మాల్‌వేర్‌లు, డీప్‌ఫేక్ ఎక్స్‌ప్లాయిట్స్ విస్తరిస్తాయని, వీటి వల్ల వ్యక్తిగత డేటా దోపిడీ, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై నకిలీ యాప్‌ల దాడులు ఎక్కువయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
హ్యాక్టివిస్టుల ముప్పు:
- గత ఏడాది కాలం: 5,842 హ్యాక్టివిస్టుల దాడులు.
- హ్యాక్టివిస్టు గ్రూపులు ప్రైవేటు, ప్రభుత్వ డేటాను హ్యాక్ చేసి, ర్యాన్సమ్ డిమాండ్ చేయడం రెట్టింపు అయింది.
10 ప్రధాన ర్యాన్సమ్‌వేర్ గ్రూపులు:
- రైసిడా
- ర్యాన్సమ్‌హబ్
- లాక్‌బిట్ 3.0
- ప్లే
- బ్లాక్‌బస్టా
- 8బేస్
- అకీరా
- మ్యావ్
- రాయల్
- ప్లే
ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు నేరగాళ్ల లక్ష్యంగా:
గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్, వన్‌డ్రైవ్, గిట్‌హబ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఐబీఎం క్లౌడ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను సైబర్ నేరగాళ్లు అధికంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు.
భవిష్యత్‌కు సైబర్ హైజీన్ కీలకం
సైబర్ భద్రత కోసం సంస్థలు సాంకేతికతను మెరుగుపరచుకోవాలని, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని నివేదిక సూచించింది. డేటా బ్యాకప్, ప్రైవసీ నియంత్రణ, మాల్‌వేర్ ప్రొటెక్షన్ వంటి సైబర్ హైజీన్ చర్యలు అత్యవసరం.