వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్బుక్ గత సంవత్సరం 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దాదాపు 130 కోట్లకు పైగా ఫేక్ అకౌంట్ లను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం సోమవారం ప్రకటించింది.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి రోసెన్ తెలిపారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్‌ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్‌ను కూడా నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అలాంటి అసత్య సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్ చేయడం లేదని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు.