మూవీడెస్క్: ఈ మధ్యనే థియేటర్ లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు సందడి చేయగా, తాజాగా విడుదలైన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రికార్డులు సృష్టిస్తోంది. కాగా ప్రస్తుతం థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా విడుదలై సందడి చేస్తున్నాయి.
కరోనా మరియు లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటి వరకు కొనసాగుతోండి. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ అవే చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మే 20వ తేదీన ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా 13 సినిమాలు సిద్ధమయ్యాయి.
ఇప్పుడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాలన్నీ థియేటర్లతో పాటు నేరుగా ఓటీటీల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ చిత్రాల జాబితా మీ కోసం:
- 12థ్ మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5
- ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో
- భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- జాంబీవ్లి- జీ5
- చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో
- మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్
- లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్
- ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్
- జాకస్- నెట్‌ఫ్లిక్స్
- నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో