బెంగళూరు: దేశంలో విజృంభిస్తున్న కరోనా కర్ణాటకలో కూడా తన పంజా విసురుతూ రోజుకు 20 వేల కేసులను తాకుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అని చెప్పకుండానే అటువంటి చర్యల వైపు అడుగులు వేస్తోంది. అంటే ఒక రకంగా హాఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేయబోతోంది.
గురువారం నుండి బెంగళూరు నగరంతో సహా రాష్ట్రమంతటా 144వ సెక్షన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండరాదని, తిరగరాదని అత్యవసర పని ఏమీ లేకుండా బయటకు రావద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. బస్సులు, రవాణా వ్యవస్థకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
రాష్ట్రంలో ఈ పాటికే రాత్రి పూట కర్ఫ్యూ, శని–ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించంది. ఈ నిషేధాజ్ఞలు మే 4వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభు త్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేశారు.