fbpx
Sunday, September 8, 2024
HomeTelanganaతెలంగాణ ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ వరాలు

తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ వరాలు

2000-RUPEES-FOR-PRIVATE-TEACHERS-IN-TELANGANA

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో అన్ని విద్యా సంస్థలు మూతపడడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరాల జల్లులు కురిపించారు. విద్యాసంస్థలు మూతపడడంతో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యాంలో వారికి ఆర్థిక సహాయంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై గురువారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అక్కడి సిబ్బంది పడుతున్న కష్టాలు ప్రస్తావనకు వచినట్లు, ముఖ్యంగా నాగార్జునసాగర్‌లో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం, తాజాగా అతడి భార్య కూడా బలవన్మరణానికి పాల్పడిన విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన పై వెంటనే సీఎం కేసీఆర్‌ స్పందించి వారిని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అనే విషయం పై చర్చించారు. ఈ క్రమంలో టీచర్లకు నెలకు రూ.2 వేల నగదు సహాయం మరియు 25 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రైవేటు టీచర్లు వెంటనే బ్యాంక్‌ ఖాతాలు, గుర్తింపు కార్డులతో కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కాగా ఈ ఆర్థిక సహాయం కేవలం గుర్తింపు పొందిన ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రమే అందనుంది. మొత్తం దాదాపుగా ఒక లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది దీని వల్ల లబ్ధి పొందనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular