దుబాయ్: 2024 icc women’s t20 world cup: తొలి టీ20లో భారత్ ఓటమి! న్యూజిలాండ్ జట్టు భారత్‌ను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఓడించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
కెప్టెన్ సోఫీ డివైన్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు మంచి స్కోరు సాధించింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లతో ప్రభావితం చేసింది.
అనంతరం లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన భారత్ జట్టు 19 ఓవర్లలో కేవలం 102 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలింగ్ ఎదుట చేతులెత్తేశారు. రోస్మరీ మెయిర్ న్యూజిలాండ్ తరఫున 4 వికెట్లు తీసి భారత జట్టు ఓటమిని ప్రభావితం చేసింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత బ్యాటర్స్ పుంజుకోకపోవడం వల్లే పరాజయం పాలైంది.
ఇక భారత్ తరువాతి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు దుబాయ్ లో ఆడనుంది.