అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రహదారుల మరమ్మతులకు నిధుల రాష్ట్ర ప్రభుత్వం రూ.2,205 కోట్లతో నిధుల ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో సుమారు 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు తాజాగా ప్రభుత్వం మంజూరు చేసింది.
ప్రతి సారి మరమ్మతులు చేయకుండా రోడ్లపై రెన్యువల్ లేయర్ వేసేందుకు ఆర్‌అండ్‌బీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో వీటికి ఆమోదం తెలుపుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఒకే ఏడాదిలో ఆర్‌అండ్‌బీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం మొదటి సారి అని నిపుణుల అంచానా.
రాష్ట్రం లో ఆర్‌అండ్‌బీ పరిధిలో 13,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు, 32,725 కి.మీ. ల జిల్లా ప్రధాన రహదారులున్నాయి. అదనంగా మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.వెయ్యి కోట్లతో మరమ్మతులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే ఈ మరమ్మతులు మళ్లీ రాకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్లు మంజూరు చేశారు.
ఏడాదిలోగా రోడ్ల ప్రత్యేక మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. మొత్తం 1,123 పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి డీజిల్/పెట్రోల్‌పై రూపాయి వంతున రోడ్ సెస్ వసూలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది జరిపిన ఆర్‌అండ్‌బీ సమీక్షలో దిశానిర్దేశం చేశారు.