న్యూఢిల్లీ : కరోనా కోరల్లో చిక్కుకుని మత్యువుతో 180, 179 రోజుల పాటు పోరాడి ప్రాణాలతో బయట పడిన వారు చాలా మందే ఉన్నారు. కానీ క్యాబ్ డ్రైవర్, పోకర్ ప్లేయరయిన అలీ సకాల్లియోగ్లూ లాగా సుదీర్ఘకాలం పాటు మత్యువుతో పోరాడి అంతిమంగా కరోనాపై విజయం సాధించి ఇంటికి తిరిగొచ్చాడు.
56 ఏళ్ల అలీ ఏకంగా 222 రోజులపాటు కరోనాతో పోరాడి మత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో వెనక్కి రావడం వైద్య చరిత్రలో ఓ అరుదైన అధ్యాయం అవుతుందని ఆయనకు చికిత్స అందించిన ఆస్పత్రి వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆయన ఆస్పత్రిలో ఉండగానే ఓ సారి గుండెపోటుకు గురయ్యారు.
ఓసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. చివరకు ఆయన శరీరంలోని పలు అవయవాలు కూడా పని చేయకుండా పోయాయి. ప్రధానంగా మూడుసార్లు ఆయన మత్యు ముఖందాకా వెళ్లి వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆగ్నేయ లండన్‌లోని క్యాట్‌ఫోర్డ్‌కు చెందిన అలీ టైప్ వన్ డయాబెటిసీతో బాల్యం నుంచి బాధ పడుతున్నారు. ఆయన గత మార్చి నెలాఖరులోనే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన కరోనా కేసులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం సూచించిన 111 నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం అర్థించారు.
అక్కడ ఆయన పరిస్థితి పరిశీలించి వైద్యులు వెంటనే ఆయనకు ఆక్సిజన్ వెంటిలేటర్ అమర్చారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. రెండు, మూడు రోజలకే ఆయనకు అక్కడ గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన్ని సోమర్‌సెట్‌లోని వెస్టన్ జనరల్ హాస్పటల్‌కు తరలించి అక్కడ ఆయన గుండెకు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో అలీకి విశ్రాంతి కోసం కోమా డ్రగ్ ఇచ్చారు.